టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో రజతం... రెజ్లింగ్ ఫైనల్లో ఓడిన రవికుమార్
- 57 కిలోల రెజ్లింగ్ లో ముగిసిన ఫైనల్
- ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలైన రవికుమార్
- రవికుమార్ కు రజతం
- ఐదుకు పెరిగిన భారత్ పతకాల సంఖ్య
కాగా, భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇది రెండో రజతం. ఇంతకుముందు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు తొలి రజతం అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించి, ఓవరాల్ పతకాల పట్టికలో 62వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా 33 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉండగా, 27 బంగారు పతకాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది.