చివరి షెడ్యూల్ షూటింగును మొదలెట్టిన విశాల్!
- విశాల్ నుంచి 31వ సినిమా
- యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- విశాల్ సరసన డింపుల్ హయతి
- త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
ప్రస్తుతం ఆయన తాజా చిత్రంగా 'నాట్ ఏ కామన్ మేన్' సినిమా రూపొందుతోంది. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగులోనే ఇటీవల విశాల్ గాయపడ్డాడు. పూర్తిగా కోలుకున్న ఆయన, మళ్లీ ఇప్పుడు షూటింగుకు హాజరయ్యాడు.
ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు ఈ రోజునే మొదలైంది. ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకూ జరిపే చిత్రీకరణతో షూటింగు పార్టు పూర్తవుతుంది. కెరియర్ పరంగా విశాల్ కి ఇది 31వ సినిమా. ఈ సినిమాలో ఆయన జోడీగా డింపుల్ హయతి అలరించనుంది. రమణ .. నంద .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.