Chiranjeevi: ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు: చిరంజీవి

chiranjeevi pais tributes to allu
  • అల్లు రామ‌లింగ‌య్య‌ వర్ధంతి సందర్భంగా ఆయ‌న‌కు నివాళులు
  • ఆయ‌న నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయన్న చిరు
  • ఒక డాక్టర్ గా, యాక్టర్ గా, ఫిలాసఫర్ గా గుర్తిండిపోతార‌ని ట్వీట్  
ప్రముఖ సినీన‌టుడు అల్లు రామ‌లింగ‌య్య‌ వర్ధంతి సందర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను తాను మరోసారి నెమరువేసుకుంటున్నాన‌ని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

'శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయి. ఒక డాక్టర్ గా, యాక్టర్ గా, ఫిలాసఫర్ గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకుంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. గ‌తంలో అల్లు రామ‌లింగ‌య్య ఫొటో వ‌ద్ద తాను నివాళులు అర్పించినప్పటి ఫొటోను చిరంజీవి పోస్ట్ చేశారు.
Chiranjeevi
Tollywood
allu

More Telugu News