Nara Lokesh: వైసీపీ మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి: నారా లోకేశ్

Nara lokesh warns YS Jagan on Bauxite Mining
  • జగన్ పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
  • నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో జగన్ బంధువర్గం గుండెల్లో రైళ్లు
  • అక్రమాలను ఆధారాలతో నిరూపించి చిప్పకూడు తినిపిస్తాం

గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గరలోనే ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియా చేస్తున్న అరాచకాలు, దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టి జైలుకు పంపిస్తామన్నారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ బంధువర్గానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో షాక్ తగిలిందని, వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

మైనింగ్ పేరుతో జరుగుతున్న దందా ఒక్కొక్కటీ బయటకు వస్తోందని, మాఫియా పునాదులు కదులుతున్నాయని లోకేశ్ అన్నారు. బాక్సైట్ కోసం తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్ అండ్ కో, వారి అక్రమ మైనింగ్‌కు సహకరించిన అధికారులు చిప్పకూడు తినడం ఖాయమని లోకేశ్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News