Baba Ramdev: యోగా గురు బాబా రాందేవ్​ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court Summons Baba Ramdev Over His Remarks On Allopathy
  • అల్లోపతి వైద్యుల మీద దుష్ప్రచారంపై సమన్లు
  • వచ్చే నెల 10న విచారించనున్న కోర్టు
  • అల్లోపతితో లక్షలాది కరోనా పేషెంట్లు చనిపోయారన్న రాందేవ్
యోగా గురు బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. అల్లోపతి వైద్యం, వైద్యుల మీద దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై సమన్లు జారీ చేసింది. కేసును కోర్టు వచ్చే నెల 10న విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు అల్లోపతి ఔషధాల వల్ల లక్షలాది మంది కరోనా పేషెంట్లు చనిపోయారని బాబా రాందేవ్ అన్నారు.

ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు ఆ వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ, పరువునష్టం నోటీసులిచ్చారు. క్షమాపణలు చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. విషయంలో జోక్యం చేసుకున్న అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందిగా రాందేవ్ కు సూచించారు. దీంతో రాందేవ్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. తర్వాత కూడా ఐఎంఏ పాట్నా, రాయ్ పూర్ సహా వివిధ ప్రాంతాల్లో రాందేవ్ పై కేసులు పెట్టింది.
Baba Ramdev
High Court
New Delhi
Allopathy
IMA

More Telugu News