Raghavendrarao: తొలిసారి నటుడిగా కెమెరా ముందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు... రాజమౌళి, అనిల్ రావిపూడి స్పందన

First time Raghvendrarao acts in PellisandaD
  • రోషన్, శ్రీలీల జంటగా పెళ్లిసందD
  • గౌరి రోణంకి దర్శకత్వంలో సినిమా
  • వశిష్ట పాత్రలో రాఘవేంద్రరావు
  • వీడియో పంచుకున్న చిత్రబృందం
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100 సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత తొలిసారి నటుడిగా 'పెళ్లిసందD' చిత్రంలో కనువిందు చేయనున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా వస్తున్న చిత్రం 'పెళ్లిసందD'. గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'పెళ్లిసందడి' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడదే టైటిల్ తో గౌరి రోణంకి దర్శకత్వంలో తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాఘవేంద్రరావు నటిస్తుండడం విశేషం. ఆయన పాత్ర పేరు వశిష్ట. కుర్రాళ్లతో ఆడిపాడే జోష్ ఉండే డైనమిక్ సీనియర్ సిటిజన్ గా రాఘవేంద్రరావు కనిపించనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

దీనిపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, అనిల్ రావిపూడి స్పందించారు. 100 సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత మన మౌన ముని కెమెరా ముందుకు వచ్చారు. 'పెళ్లిసందD' చిత్రం ద్వారా నటుడిగా రాఘవేంద్రరావు ఫస్ట్ లుక్ ఇదే... చూడండి అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇంతకాలం కెమెరా వెనుక ఉండి చూపించిన దర్శకేంద్రుడి మాయ ఇప్పుడు కెమెరా ముందు చూడబోతున్నాం అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. "రాఘవేంద్రరావు గురూజీ... మళ్లీ ఈ 'పెళ్లిసందడి' మరో సంచలనం అవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Raghavendrarao
Acting
PellisandaD
Rajamouli
Anil Ravipudi
Tollywood

More Telugu News