Prithvi: నారాయణ ముగ్గురు పిల్లలు నా సొంత బిడ్డలతో సమానం: థర్టీ ఇయర్స్ పృథ్వి

They are also like my own children says 30 Years Prithvi
  • ఇటీవల మరణించిన మిలిటరీ నారాయణ
  • పృథ్వి కుటుంబంతో కలిసి నివసిస్తున్న నారాయణ పెద్ద కూతురు 
  • నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన పృథ్వి
టాలీవుడ్ కమెడియన్ పృథ్వి ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మగానిపల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన గొల్ల నారాయణ (మిలిటరీ నారాయణ) కుటుంబాన్ని పరామర్శించారు. అంతకు ముందు నారాయణ సమాధి వద్ద అంజలి ఘటించారు. నారాయణ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు.
 
మిలిటరీ నారాయణకు భార్య లలిత, ఇద్దరు కూతుళ్లు తేజస్విని, దివ్య, కుమారుడు తరుణ్ కుమార్ ఉన్నారు. పెద్ద కూతురు 2014 నుంచి టాలీవుడ్ లో పని చేస్తున్నారు. హైదరాబాదులో పృథ్వి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. రెండో కూతురు బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి సచివాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు తరుణ్ డిప్లొమో పూర్తి చేసి పెనుకొండ సమీపంలోని కియా కార్ల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ, నారాయణ పిల్లలు కూడా తన సొంత బిడ్డలతో సమానమని చెప్పారు. వారు మంచి పొజిషన్ కు వెళ్లేంత వరకు తన వంతు సాయం చేస్తానని తెలిపారు. మిలిటరీ నారాయణ అంత్యక్రియలకు రాలేకపోవడంతో ఆయన ఈరోజు వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు.
Prithvi
Tollywood
Militery Narayana

More Telugu News