Tulasi Reddy: జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణకాష్ఠంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది: తులసిరెడ్డి

The Congress party had earlier said that the state would become Ravanakashta if Jagan becomes the CM says Tulasi Reddy
  • ఏపీలో ఆటవిక పాలన నడుస్తోంది
  • బ్రిటీష్ పాలనలో కూడా ఇన్ని దారుణాలు జరగలేదు
  • దేవినేని ఉమాపై వైసీపీ దాడి చేస్తే.. తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు

రెండేళ్ల జగన్ పాలనలో ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రావణకాష్ఠంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందని గుర్తు చేశారు. బ్రిటీష్ పాలనలో కూడా ఇన్ని దారుణాలు జరగలేదని అన్నారు.

టీడీపీ నేత దేవినేని ఉమాపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తే... దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా... తిరిగి ఉమాపైనే కేసులు పెట్టడం దారుణమని తులసిరెడ్డి దుయ్యబట్టారు. వైసీపీ దాడి చేస్తే... దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం జగన్ జిల్లాలోనే ఎంతో మంది హత్యకు గురయ్యారని విమర్శించారు. జగన్ పద్ధతి మార్చుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకం... విద్యార్థుల పాలిట శాపంలా మారిందని అన్నారు.

  • Loading...

More Telugu News