దేవినేని ఉమ వాహనంపై రాళ్లదాడి... చంద్రబాబు పరామర్శ
- కొండపల్లి ప్రాంతంలో మైనింగ్
- అక్రమ మైనింగ్ అంటూ ఉమ ఆరోపణలు
- మైనింగ్ పరిశీలించి వస్తుండగా దాడి
- కారు అద్దాలు ధ్వంసం
- వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత
ఈ ఘటనపై దేవినేని ఉమ తీవ్రంగా స్పందించారు. తనపై దాడి చేసిన వాళ్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులని ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... ఉమకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దాడులతో భయపడేదిలేదని స్పష్టం చేశారు. వైసీపీపై తమ పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు.
కాగా, ఈ ఘటన నేపథ్యంలో, భద్రత కల్పించడంలో పోలీసుల విఫలం అయ్యారని దేవినేని ఉమ విమర్శలు చేశారు. ఈ క్రమంలో జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.