బెంగళూరుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్
- తదుపరి సీఎం ఎంపిక నేపథ్యంలో బెంగళూరుకు వెళ్తున్న వైనం
- బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న కేంద్ర మంత్రులు
- రాత్రిలోగా సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం
సీఎం రేసులో ప్రహ్లాద్ జోషి, బీఎస్ సంతోష్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, తేజస్వి సూర్య, బసవరాజ బొమ్మై పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో జోషి, సంతోశ్, విశ్వేశ్వర హెగ్డే, తేజస్వి సూర్యలకు ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బసవరాజ బొమ్మై బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆరెస్సెస్ నేపథ్యం లేదు. వీరితో పాటు అరవింద బెల్లర్, మురుగేశ్ నిరాణిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ రాత్రి లోగా తదుపరి సీఎం పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.