GVL Narasimha Rao: ఏపీ ప్రభుత్వం పరిధిని దాటి అప్పులు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ కు వివరించా: జీవీఎల్

GVL met Nirmala Sitharaman and explains AP Govt economical situation
  • నిర్మలా సీతారామన్ తో జీవీఎల్ భేటీ
  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చించినట్టు జీవీఎల్ వెల్లడి
  • నిబంధనలు అతిక్రమిస్తోందని ఆరోపణ
  • పోలవరంపైనా మాట్లాడానని వివరణ
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై నిర్మలా సీతారామన్ కు తెలిపానని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం పరిధిని మించి అప్పులు చేస్తోందని ఆమెకు వివరించానని తెలిపారు. రుణాలు తీసుకునేందుకు నిబంధనలను కూడా అతిక్రమిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని జీవీఎల్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా ఈ భేటీలో మాట్లాడానని తెలిపారు.
GVL Narasimha Rao
Nirmala Sitharaman
AP Govt
Financial Position
BJP
Andhra Pradesh

More Telugu News