KTR: టీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఉద్యోగం ఇప్పిస్తానని కేటీఆర్ హామీ

Will give job to Srinivas Reddy family says KTR
  • కరోనాతో ఇటీవల మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి
  • శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
  • తక్షణ సాయంగా రూ. 2 లక్షలు అందించిన వైనం
కరోనా బారిన పడి కొన్ని రోజుల క్రితం మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త, సిరిసిల్ల జిల్లా నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్ రెడ్డి కుంటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఈరోజు పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు, కుటుంబాలకు అన్ని విధాలుగా టీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు స్థానికులు పెద్ద సంఖ్యలో వినతిపత్రాలను అందించారు.
KTR
TRS
Srinivas Reddy

More Telugu News