వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత్ పతకాల పంట... ప్రధాని మోదీ అభినందనలు
- బుడాపెస్ట్ లో వరల్డ్ క్యాడెట్ చాంపియన్ షిప్స్
- 5 స్వర్ణాలు సహా 13 పతకాలు సాధించిన భారత్
- రాణించిన భారత అమ్మాయిలు
- భవిష్యత్తులోనూ ఇదే ప్రదర్శన కనబర్చాలన్న ప్రధాని
దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత క్రీడాకారులు గర్వించేలా చేస్తున్నారని, వారి అమోఘమైన ప్రదర్శన కొనసాగుతోందని కితాబునిచ్చారు. హంగేరిలోని బుడాపెస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బృందాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ వారు అత్యుత్తమంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.