ఏపీ రోజువారీ కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల
- గత 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు
- 2,252 మందికి పాజిటివ్
- తూర్పు గోదావరి జిల్లాలో 385 కేసులు
- విజయనగరం జిల్లాలో 27 కేసులు
- రాష్ట్రంలో 15 మంది మృతి
అదే సమయంలో 2,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 13,256 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,54,765 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,19,354 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,155 మందికి చికిత్స జరుగుతోంది.