'లక్ష్య' అప్ డేట్స్ ఆగవంటున్న నాగశౌర్య!
- షూటింగు దశలో 'లక్ష్య'
- దర్శకుడిగా సంతోష్ జాగర్లపూడి
- కథానాయికగా కేతిక శర్మ
- కీలక పాత్రలో జగపతి
ఈ నేపథ్యంలో ఇక ప్రతి శుక్రవారం ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని నాగశౌర్య తెలియజేశాడు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఈ సినిమా నుంచి అప్ డేట్ ఉంటుందని స్పష్టం చేశాడు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా పోస్ట్ చేశాడు. కాలభైరవ అందించిన సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు.
నాగశౌర్య సరసన నాయికగా కేతిక శర్మ నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నాగశౌర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. 'వరుడు కావలెను' .. 'పోలీస్ వారి హెచ్చరిక'తో పాటు సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా సెట్స్ పైనే ఉన్నాయి.