Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం

India beats New Zealand in hockey in Tokyo Olympics
  • న్యూజిలాండ్ ను 3-2 తేడాతో ఓడించిన భారత్
  • రెండు గోల్స్ చేసిన హర్మన్ ప్రీత్ సింగ్
  • అద్భుత ప్రతిభ కనపరిచిన గోల్ కీపర్ శ్రీజిష్
టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్-ఏలో జరిగిన తొలి మ్యాచులో న్యూజిలాండ్ ను 3-2 తేడాతో చిత్తు చేసింది. భారత్ తరపున హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, రూపిందర్ పాల్ సింగ్ ఒక గోల్ చేశాడు. మ్యాచ్ చివర్లో న్యూజిలాండ్ దూకుడుగా ఆడింది. వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించింది.

అయితే భారత గోల్ కీపర్ శ్రీజిష్ తన అద్భుత ప్రతిభతో ప్రత్యర్థికి గోల్స్ రాకుండా అడ్డుకున్నాడు. దీంతో మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఒలింపిక్స్ ను విజయంతో ఆరంభించింది. తదుపరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరగనుంది. పూల్-ఏలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, జపాన్ ఉన్నాయి.
Tokyo Olympics
Hockey
India
New Zealand

More Telugu News