చిక్కుల్లో నటి ప్రియమణి వైవాహిక జీవితం... తెరపైకి ముస్తఫారాజ్ మొదటి భార్య
- 2017లో ముస్తఫారాజ్ తో ప్రియమణి పెళ్లి
- అప్పటికే ముస్తఫారాజ్ కు ఆయేషాతో పెళ్లి
- ఇద్దరు పిల్లలు కూడా ఉన్న వైనం
- 2011 నుంచి వేర్వేరుగా ఉంటున్న ముస్తఫా, ఆయేషా
కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల నేపథ్యంలో 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2017లో ప్రియమణిని ముస్తఫారాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, భర్త ముస్తఫా రాజ్ తనను, తన పిల్లలను పట్టించుకోవడంలేదని ఆయేషా తాజాగా ఆరోపించింది.
ఆమె ఆరోపణలను ముస్తఫా రాజ్ ఖండించాడు. పిల్లల పెంపకానికి అవసరమైన డబ్బును ప్రతి నెలా పంపిస్తున్నానని వివరించాడు. తన నుంచి మరింత డబ్బు తీసుకోవడానికే ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తోందని అన్నాడు.