Farm Laws: కిసాన్​ సంసద్​ మొదలు.. చనిపోయిన 500 మంది రైతులకు నివాళి

Kisan Parliament Starts with Paying Tributes to Farmers Those who Take Lives
  • పార్లమెంట్ పద్ధతుల ప్రకారమే సభ
  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల మధ్యే చర్చ
  • చర్చలంటూనే షరతులు పెడుతున్నారన్న తికాయత్
ఢిల్లీలోని  జంతర్ మంతర్ వద్ద రైతుల పార్లమెంట్ (కిసాన్ సంసద్) ప్రారంభమైంది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని 200 మంది రైతులు అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. ముందుగా ఇన్నాళ్ల రైతు ఉద్యమంలో చనిపోయిన 500 మంది రైతులకు వారు నివాళులర్పించారు. అనంతరం కిసాన్ పార్లమెంట్ చర్చలను మొదలుపెట్టారు. బస్సులు, కార్లలో ఆ రైతులు తరలివచ్చారు.


పార్లమెంట్ ఎలాగైతే సాగుతుందో.. అలాంటి పద్ధతులనే కిసాన్ సంసద్ లోనూ అవలంబించనున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు.. చర్చల మధ్య చాయ్ విరామాన్నీ తీసుకోనున్నారు. రైతులూ తమ సొంత పార్లమెంట్ ను నిర్వహించగలరని దీనితో నిరూపితమైందని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. 8 నెలల క్రితం ప్రభుత్వం తమను అసలు రైతులుగానే చూడలేదని, ఇప్పటికైనా తమను రైతులుగా ఒప్పుకొన్నారని అన్నారు. చర్చలంటూనే అందులో షరతులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.
Farm Laws
Kisan Sansad

More Telugu News