Kishan Reddy: ఏపీలోని 3 చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా గుర్తింపు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Union govt recognizes three historical places in AP
  • ఏపీలోని చారిత్రక కట్టడాలకు కేంద్రం గుర్తింపు
  • నాగార్జునకొండ, శాలిహుండం, లేపాక్షి ఆలయంలకు గుర్తింపు
  • మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న కిషన్ రెడ్డి
  • వారసత్వ కట్టడాల దత్తత పథకంలో గండికోట  
ఏపీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 3 చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తించినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాల జాబితాలో చేర్చినట్టు తెలిపారు.

ఈ ఆదర్శ స్మారకాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వీటిలో వై-ఫై ఇంటర్నెట్ సౌకర్యం, ఎగ్జిబిషన్, లైటింగ్ ప్రదర్శనలు, కెఫే వంటి ఏర్పాట్లు చేస్తామని కిషన్ రెడ్డి వివరించారు. ఇక వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం కల్పించినట్టు వెల్లడించారు.
Kishan Reddy
Andhra Pradesh
Historical Places
Iconic Memorials

More Telugu News