అంచనాలు పెంచుతున్న కమల్ 'విక్రమ్'!
- కమల్ సొంత బ్యానర్లో 'విక్రమ్'
- ముఖ్య పాత్రల్లో స్టార్ హీరోలు
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
- వచ్చే ఏడాదిలోనే రిలీజ్
మొదటి నుంచి కూడా కమల్ ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఒక ప్రయోగమేనని అంటున్నారు. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. నరేన్ .. అర్జున్ దాస్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వరుసగా వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్న లోకేశ్ కనగరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.