మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన కంభంపాటి హరిబాబు
- ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం
- కరోనా కారణంగా హాజరు కాని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- హాజరైన కంభంపాటి కుటుంబ సభ్యులు
నిజానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంసు ధులియా ఈ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. అయితే, ఆయన కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతుండడంతో ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు. హరిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంథంగా, మంత్రులు, అధికారులతోపాటు హరిబాబు భార్య జయశ్రీ, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.