Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Rashmika to play one of the lead roles opposite Charan
  • రామ్ చరణ్ కు జంటగా రష్మిక
  • 22 నుంచి 'రాధేశ్యామ్' షూటింగ్
  • 'లూసిఫర్' రీమేక్ లో సముద్రఖని  
*  రామ్ చరణ్ సరసన రష్మిక కథానాయికగా నటించే అవకాశం కనిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. ఇందులో ఒకరిగా ఇప్పటికే కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. మరో నాయిక పాత్రకు రష్మికను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
*  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగును ఈ నెల 22 నుంచి తిరిగి హైదరాబాదులో నిర్వహిస్తారు. ఆ రోజు నుంచే ప్రభాస్, పూజ హెగ్డే షూటింగులో పాల్గొంటారట.
*  మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్'ను మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఇందులో ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖనిని ఓ కీలక పాత్రకు ఎంచుకున్నట్టు సమాచారం. మోహన్ రాజా దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. 'ఆచార్య' చిత్రం షూటింగు పూర్తవగానే ఇది మొదలవుతుంది.
Rashmika Mandanna
Charan
Prabhas
Pooja Hegde
Chiranjeevi

More Telugu News