Raviteja: 'ఖిలాడి' షూటింగుకు బ్రేక్ పడిందట!

Temporary break for Khiladi shooting
  • చివరిదశలో 'ఖిలాడి'
  • రవితేజలో అసహనం
  • షూటింగుకు తాత్కాలిక బ్రేక్
  • సెట్ చేసేందుకు ప్రయత్నాలు
రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు పూర్తవుతుంది. కానీ ఈ సమయంలోనే ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా చెబుతున్నారు. షెడ్యూల్స్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం రవితేజను ఇబ్బందికి గురిచేస్తోందట. వరుస సినిమాలను ఒప్పేసుకుని ఉన్న రవితేజకు, ప్లానింగ్ లోపం అసహనాన్ని కలిగించిన కారణంగానే ఈ సినిమా షూటింగు ఆగిపోయిందని అంటున్నారు.

'ఖిలాడి' కోసం తాను ముందుగా ఇచ్చిన డేట్స్ పూర్తికావడంతో, రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సెట్స్ పైకి వెళ్లిపోయాడని చెప్పుకుంటున్నారు. రవితేజతో మాట్లాడి .. మిగతా షూటింగును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో 'ఖిలాడి' దర్శక నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఇక శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. 'ఖిలాడి'లో మాదిరిగానే ఈ సినిమాలోను ఇద్దరు హీరోయిన్లు అందాల సందడి చేయనున్నారు.
Raviteja
Meenakshi Choudary
Dimple Hayathi

More Telugu News