ఎస్ఈసీ నీలం సాహ్నీపై దాఖలైన పిటిషన్ విచారణ ఈ నెల 23కి వాయిదా
- ఇటీవల ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకం
- వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్
- ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదన్న ఎస్ఈసీ న్యాయవాది
- డివిజన్ బెంచ్ కు బదలాయించాలని విజ్ఞప్తి
ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందికి వస్తుందని గతంలో పలు తీర్పులు ఉన్నాయని వెల్లడించారు. అయితే, గత తీర్పులను ఫైల్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.