టీమిండియాతో తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక
- నేటి నుంచి శ్రీలంకలో టీమిండియా పర్యటన
- కొలంబో ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే
- బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- దసున్ షనక నాయకత్వంలో ఆడుతున్న లంక
టీమిండియాలో ధావన్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, కుల్దీప్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరికితోడు పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, దీపక్ చహర్ వంటి ప్రతిభావంతులు కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు.
కాగా, ఈ సిరీస్ ఆరంభానికి ముందు లంక జట్టులో కరోనా కలకలం రేగింది. సిరీస్ జరగడంపై అనుమాన మేఘాలు ముసురుకున్నాయి. అయితే, లంక బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఇవాళ్టి మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమం అయింది.