Etela Rajender: హుజూరాబాద్ నుంచి ఈట‌ల భార్య పోటీ?.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌మున‌

jamuna on huzurabad by polls
  • హుజురాబాద్ పోటీలో నేను కూడా ఉన్నా
  • ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు
  • నా భ‌ర్త‌ పోటీ చేసినా, నేను పోటీ చేసినా ఒక్కటే
  • ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తాం  
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన‌ హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌రత్తు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నియోజక వ‌ర్గం నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీకి దిగ‌కుండా ఆయ‌న భార్య జ‌మున‌ను బ‌రిలోకి దింపుతార‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చేలా జ‌మున ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తి రేపుతోంది.

హుజురాబాద్ పోటీలో తాను కూడా ఉన్నట్లు  జ‌మున వ్యాఖ్యానించారు. అయితే, ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త‌న భ‌ర్త‌ పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలోనూ తాను తన భర్త ఈటలను వెనకుండి నడిపించానని ఆమె తెలిపారు. అలాగే, ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని అన్నారు. త‌మ‌ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తామ‌ని చెప్పారు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో ఆమె ప్ర‌చారం చేస్తున్నారు. రేప‌టి నుంచి ఈటల కూడా పాదయాత్ర చేయ‌నున్న విషయం తెలిసిందే.

Etela Rajender
Huzurabad
TRS
BJP

More Telugu News