నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది... దాన్ని కాలరాసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?: నారా లోకేశ్
- ఈ నెల 19న ఛలో తాడేపల్లి
- పిలుపునిచ్చిన విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు
- అనుమతి నిరాకరించిన పోలీసులు
- ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడిన లోకేశ్
"ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల19న ఛలో తాడేపల్లి కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోగా, గుంటూరు ఎస్పీ స్వయంగా నిరుద్యోగ యువతను బెదిరించేలా మాట్లాడారు. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇదే నిదర్శనం. సీఎం నివాసం వద్ద శాశ్వతంగా 144 సెక్షన్ అమలు చేయడం ఒక తప్పయితే, అసలు అక్కడ నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదనడం ద్వారా పోలీసులు మరో పెద్ద తప్పు చేస్తున్నారు. వైసీపీ కండువా కప్పుకున్నట్టుగా జగన్ కు గులాంగిరీ చేస్తున్న అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదు. నిరుద్యోగులను కాపాడ్డానికి అంబేద్కర్ రాజ్యాంగం ఉందని గుర్తుంచుకోండి" అంటూ ధ్వజమెత్తారు.