రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం.. సీఎం జగన్కు రఘురామ లేఖ
- రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానం
- వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మరమ్మతు పనులు చేపట్టాలి
- దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా గోతులు ఉన్నాయని, స్తంభాన్ని పట్టుకుంటే షాక్ కొట్టే ఘటనలు జరుగుతాయని ఆయన చెప్పారు. బతుకు బండి లాగడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో రోడ్డు మీద బండి తోలడం మరీ సంక్లిష్టంగా తయారైందని ఆయన తెలిపారు. రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని దీనిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.