వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో... ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్ సభ సచివాలయం నోటీసులు
- రఘురామపై వైసీపీ ఎంపీల ఫిర్యాదు
- అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ కు వినతి
- 290 పేజీల సమాచారం అందజేత
- రఘురామతో పాటు ఇద్దరు టీఎంసీ ఎంపీలకూ
రఘురామకు త్వరలోనే నోటీసులు అందుతాయని భరత్ అప్పుడే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే, ఇవాళ ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్ సభ సచివాలయం నోటీసులు పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై ఈ నోటీసులు పంపారు. రఘురామతో పాటు మరో ఇద్దరు టీఎంసీ ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ లకు కూడా ఇదే తరహా నోటీసులు వెళ్లాయి. ఈ నోటీసులపై 15 రోజుల్లో బదులివ్వాలని లోక్ సభ సచివాలయం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.