సెక్షన్ 66ఏ కేసులు ఎదుర్కొంటున్న జనసైనికులకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్
- సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ప్రభుత్వం వేధిస్తోంది
- సెక్షన్ 66ఏను సుప్రీంకోర్టు కొట్టేసింది
- కేసులను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది
సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేస్తూ, ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తే... బాధిత జనసైనికులకు జనసేన అండగా నిలుస్తుందని చెప్పారు. న్యాయ సహాయం అవసరమైన జనసైనికులు జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ (ఫోన్ నంబర్ 9032143697) ను సంప్రదించాలని సూచించారు. sambasivaevana@gmail.com కి మెయిల్ పంపడం ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.