2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇప్పించేలా పోరాటానికి నేను సిద్ధం: నారా లోకేశ్
- 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారు
- రెండేళ్ల తర్వాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేశారు
- నిరుద్యోగులు ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
రెండేళ్లు గడిచిన తరువాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేసి యువతకి జగన్ తీరని ద్రోహం చేశారని లోకేశ్ మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు స్తోమతకి మించి అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారని చెప్పారు.
ఇప్పుడు వారంతా తిరిగి ఊరు వెళ్లలేక, అమ్మానాన్నలకు మొఖం చూపించలేక ఆందోళనలో ఉన్నారని లోకేశ్ అన్నారు. నిరుద్యోగులు పడుతున్న ఆందోళన చూస్తే బాధేస్తుందని చెప్పారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కానే కాదని అన్నారు. నిరుద్యోగులు నిరుత్సాహ పడకూడదని... అందరం కలిసి పోరాడుదామని చెప్పారు. జాదూ రెడ్డి మెడలు వంచి 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేలా పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.