దూకుడు మీదున్న యంగ్ హీరో!
- 'రాజావారు రాణిగారు'తో పరిచయం
- విడుదలకి సిద్ధమైన 'ఎస్ ఆర్ కల్యాణ మండపం'
- సెట్స్ పై 'సమ్మతమే'
- లైన్లో 'సెబాస్టియన్'
ఈ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ఒకటి 'సమ్మతమే' .. మరొకటి 'సెబాస్టియన్'. రేపు కిరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాల నుంచి అప్ డేట్స్ వదులుతూ వస్తున్నారు. రేపు ఉదయం 10.05 నిమిషాలకు 'సమ్మతమే' సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారు. ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కిరణ్ సరసన నాయికగా చాందినీ చౌదరి అలరించనుంది. ఇదంతా చూస్తుంటే కిరణ్ మంచి దూకుడు మీదే ఉన్నాడనే విషయం అర్థమవుతోంది.