ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకెళ్లారు: జగన్ పై చంద్రబాబు విమర్శ
- కరోనాను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది
- టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను ఎదుర్కొనేవాళ్లం
- పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతో కాలం పాలించలేరు
రైతుల వద్ద ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం వారికి డబ్బులు ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కొంత కాలం మాత్రమే పాలించగలరని... రైతులు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. పోలీసులు కూడా హుందాగా పని చేయాలని అన్నారు. ఆయనను నమ్ముకున్నోళ్లంతా జైలుకు వెళ్లారని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కోసం తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అన్నారు.