అనుష్క సినిమా ఆగిపోయిందట!
- 'నిరాశపరిచిన 'నిశ్శబ్దం'
- లైన్లో లేని తదుపరి ప్రాజెక్టు
- నవీన్ పోలిశెట్టితో సినిమా కేన్సిల్
ఫలానా బ్యానర్లో .. ఫలానా హీరోతో అనుష్క చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ కూడా ప్రచారం దగ్గరే ఆగిపోయాయి. ఏ సినిమాను గురించిన ప్రకటన కూడా అధికారికంగా రాలేదు. ఈ నేపథ్యంలోనే నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్ర ధారిగా ఒక సినిమా రూపొందనుందనీ, ఈ సినిమాలో ఆయన ఊహల నాయికగా అనుష్క కనిపించనుందనే టాక్ వచ్చింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో, మహేశ్.పి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టు చెప్పారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు కేన్సిల్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు అనుష్క అంగీకరించిందా? లేదా? అనే విషయం మాత్రం అంతుబట్టని రహస్యమే అయిపోయింది.