Sharmila: వనపర్తిలో వైఎస్ ష‌ర్మిల నిరాహార దీక్ష ప్రారంభం

sharmila slams govt

  • కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల
  • అనంత‌రం ఉద్యోగాల కోసం దీక్ష‌
  • ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కొన‌సాగింపు

నిరుద్యోగులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు, ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే వ‌ర‌కు తాను పోరాడ‌తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నాయ‌కురాలు షర్మిల ఈ రోజు ఈ డిమాండ్ తో దీక్ష ప్రారంభించారు. ఇటీవల వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామంలో కొండల్ అనే యువ‌కుడు ఉద్యోగం రావ‌ట్లేద‌ని మ‌న‌స్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే.

కొండల్‌ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల వ‌న‌ప‌ర్తిలోనే ఈ ఉద్యోగదీక్ష చేపట్టారు. 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్షల్లో భాగంగానే ఆమె ఈ దీక్ష‌లో పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొన‌సాగుతుంది. ఈ దీక్ష‌లో నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నేత‌లు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News