Hend Zaza: 12 ఏళ్లకే ఒలింపిక్స్‌కు.. అందరి దృష్టి హెంద్ జజాపైనే!

Hend Zaza create record as youngest athlet to be participate in tokyo olympics
  • ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్న అతి పిన్న వయస్కురాలిగా హెంద్
  • సిరియాకు చెందిన హెంద్‌ గతేడాదే ఒలింపిక్స్‌కు అర్హత
  • ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో 115వ స్థానం
సిరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హెంద్ జజా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 12 ఏళ్ల ఈ చిన్నారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనార్హం. ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో ఆమె స్థానం 155. గత ఫిబ్రవరిలో జరిగిన పశ్చిమాసియా టేబుల్ టెన్నిస్ అర్హత టోర్నీలో టైటిల్ సాధించడం ద్వారా ఒలింపిక్స్‌‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 11 సంవత్సరాలే కావడం గమనార్హం.

 1968లో జరిగిన మెక్సికో ఒలింపిక్స్‌లో రొమేనియాకు చెందిన 13 ఏళ్ల ఫిగర్ స్కేటర్ బిట్రీస్ పాల్గొంది.  ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంతకంటే తక్కువ వయసున్న హెంద్ ఇప్పుడు పోటీపడబోతోంది. 1896 ఏథెన్స్ ఆధునిక ఒలింపిక్స్‌లో పదేళ్ల వయసులో జిమ్నాస్ట్ దిమిత్రోస్ లౌండ్రాస్ కాంస్యం గెలిచాడు. ఒలింపిక్స్‌లో పోటీపడిన అతి పిన్న అథ్లెట్‌గా అతడి పేరు రికార్డులకెక్కింది.
Hend Zaza
Tokyo Olympics
Syria

More Telugu News