Talasani: బోనాల ఉత్సవాల కోసం రూ.90 కోట్లు కేటాయించాం: మంత్రి తలసాని

Talasani held meeting to discuss Bonalu celebrations
  • హైదరాబాదులో బోనాలు
  • ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు
  • రూ.7 కోట్లతో వివిధ పనులు
  • సమీక్ష చేపట్టిన మంత్రి తలసాని
బోనాలపై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం చేపట్టారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తలసాని వెల్లడించారు. బోనాల ఉత్సవాల కోసం మొత్తం రూ.90 కోట్లు కేటాయించామని, ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లు, వివిధ ఆలయాలకు రూ.15 కోట్లు అని వివరించారు. ఆగస్టు 1న పాతబస్తీ బోనాల ఉత్సవాల కోసం రూ.7 కోట్లతో వివిధ పనులు చేపట్టినట్టు తెలిపారు. కరోనా ముప్పు నేపథ్యంలో ఉత్సవాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Talasani
Bonalu
Hyderabad
TRS
Telangana

More Telugu News