వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ
- నగరంలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ
- ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి కొవిడ్ రోగుల ప్రాణాలు నిలిపిన ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తారా?: ఎంఏ గఫూర్
- దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు: జి. ఓబులేసు
- వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న పల్లా శ్రీనివాసరావు
వాజ్‌పేయి హయాంలో ప్రైవేటీకరణను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎంపీ ఎర్రంనాయుడు అడ్డుకున్నారని, ఢిల్లీలో పోరాడితే మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్తోందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును రక్షించి విజయసాయిరెడ్డి తన నిబద్ధతను నిరూపించుకోవాలని అన్నారు. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.