Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అమానుషం.. కులం చెప్పాలంటూ యువకుడిపై క్రూరంగా దాడి, వీడియో వైరల్!

Dalit youth thrashed hit on private parts in UPs Kanpur Dehat
  • యువకుడి కులం చెప్పమన్న నిందితులు
  • చెప్పేందుకు నిరాకరించిన యువకుడు
  • కాళ్లతో తంతూ, కర్రలతో చావబాదిన నిందితులు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా అక్బాపూర్‌లో అమానుష ఘటన జరిగింది. ఓ గుడిసెలో కూర్చున్న 20 ఏళ్ల యువకుడి వద్దకు వెళ్లిన ఓ గ్యాంగ్.. కులం చెప్పాలంటూ అతడిని నిలదీసింది. అతడు చెప్పేందుకు నిరాకరించడంతో వారు రెచ్చిపోయారు. కర్రలతో దాడి చేశారు. జుత్తుపట్టుకుని కిందికిలాగి కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ విచక్షణ రహితంగా ప్రవర్తించారు.

వారి దెబ్బలు తాళలేని యువకుడు బాధతో విలవిల్లాడుతున్నా కనికరించలేదు సరికదా, చెట్టుకు కట్టేసి మళ్లీ దాడిచేశారు. యువకుడిని చావబాదుతున్నవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధిత యువకుడికి కాన్పూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Uttar Pradesh
Kanpur
Attack
Crime News

More Telugu News