Sujana Chowdary: సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో ఊరట... అమెరికా వెళ్లేందుకు అనుమతి

Telangana high court permits Sujana Chowdary to go US
  • గతంలో సుజనాపై సీబీఐ లుకౌట్ నోటీసులు
  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సుజనా
  • సుజనా పిటిషన్ పై విచారణ
  • సీబీఐకి అన్ని వివరాలు తెలపాలని సుజనాకు ఆదేశం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి తెలంగాణ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయన అమెరికా వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తనపై గతంలో సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, సుజనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన ధర్మాసనం ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే, అమెరికా పర్యటనకు వెళ్లేముందు, వచ్చిన తర్వాత సీబీఐకి అన్ని వివరాలు అందించాలని సుజనాను ఆదేశించింది.
Sujana Chowdary
USA
Telangana High Court
CBI
Lookout Notice

More Telugu News