Saitej: 'రిపబ్లిక్' నుంచి లిరికల్ వీడియో సాంగ్

Lyrical video released from Republic movie
  • సాయితేజ్ తాజా చిత్రంగా 'రిపబ్లిక్'
  • అవినీతి రాజకీయాల చుట్టూ తిరిగే కథ
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' రూపొందింది. అవినీతికి .. అన్యాయాలకు ఆశ్రయం కల్పిస్తున్న రాజకీయాల చుట్టూ అల్లిన కథ ఇది. ఇలాంటి రాజకీయాల తీరుపై నిరసన గళం వినిపించే ఒక పౌరుడి కథ ఇది. భారీ బడ్జెట్ తో భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో, సాయితేజ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ .. జగపతిబాబు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు.

కాలేజ్ కుర్రాళ్లు పాడుకునేలా కంపోజ్ చేయబడిన ఈ పాట, టైటిల్ కి తగినట్టుగానే ఉంది. హక్కుల రెక్కలను విరిచేసి ... రంగుల కలలను చెరిపేస్తున్నారు. స్వేచ్ఛ అనేది ఇంకా పంజరంలోనే బంధించబడి ఉంది అనే అర్థం వచ్చేలా ఈ పాట సాగుతుంది. రెహ్మాన్ సాహిత్యాన్ని అందించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. రాజు సుందరం కొరియోగ్రఫీని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి బృందం ఆలపించారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయితేజ్, ఈ సినిమాతో తన నిరీక్షణ ఫలిస్తుందని భావిస్తున్నాడు.
Saitej
Aishwarya Rajesh
Jgapathi Babu
Ramya Krishna

More Telugu News