Yanamala: రౌతులపూడిలో జగన్ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపింది: యనమల

Yanamala condemns TDP leaders arrest in Rowthulapudi
  • విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలు
  • పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలు
  • మీడియా సమావేశం ఏర్పాటు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • టీడీపీ నేతల అరెస్ట్ అనైతికమన్న యనమల
విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రౌతులపూడి వద్ద మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం అనైతికం అని వ్యాఖ్యానించారు. విపక్ష నేతల వాక్ స్వాతంత్ర్యాన్ని జగన్ ప్రభుత్వం హరిస్తోందని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడినా అరెస్టు చేసే కొత్త సంప్రదాయానికి తెరలేపారని యనమల విమర్శించారు. జగన్ పాలనలో ఏపీ మరో ఉత్తర కొరియాలా మారుతోందని అన్నారు. టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Yanamala
Rowthulapudi
TDP Leaders
Arrest
Police
Jagan
Andhra Pradesh

More Telugu News