'శ్రీదేవి సోడా సెంటర్' నుంచి హుషారెత్తించే సాంగ్!
- గ్రామీణ నేపథ్యంతో 'శ్రీదేవి సోడా సెంటర్'
- సుధీర్ బాబు జోడీగా ఆనంది
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. 'మందులోడా ఓరి మాయలోడా' అంటూ ఈ పాట జోరుగా .. హుషారుగా సాగుతోంది. జానపద బాణీలో మణిశర్మ స్వరపరిచిన ఈ పాట, మాస్ ఆడియన్స్ మనసు దోచేలా ఉంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, సాహితి చాగంటి - ధనుంజయ ఆలపించారు. విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో సుధీర్ బాబు ఉన్నాడు.