CBI Office: ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

Fire accident in CBI office in Delhi
  • లోథీ రోడ్ లో సీబీఐ కార్యాలయం
  • సీజీవో కాంప్లెక్స్ లో మంటలు
  • పరుగులు తీసిన ఉద్యోగులు
  • ఘటన స్థలికి 6 ఫైరింజన్లు
  • షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్న అధికారులు
ఢిల్లీలోని సీబీఐ కార్యాయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లోథీ రోడ్ లో సీబీఐ ఆఫీసు ఉంది. ఈ భవనంలోని సీజీవో సముదాయంలో మంటలు చెలరేగడంతో సిబ్బంది తీవ్రభయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అగ్నికీలలు ఎగసిపడడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. ఘటన స్థలికి ఆరు ఫైరింజన్లను తరలించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
CBI Office
Fire Accident
New Delhi
CGO

More Telugu News