దుబాయ్ లోని జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు
- ప్రపంచంలోనే అతి పెద్ద నౌకాశ్రయం జెబెల్ అలీ పోర్టు
- కంటెయినర్ షిప్ కు మంటలు అంటుకుని పేలుడు
- ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాని వైనం
పేలుడు శబ్దంతో తాము భయకంపితులమయ్యామని పోర్టుకు సమీపంలో నివసిస్తున్నవారు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టామని, బయటకు వచ్చి చూస్తే ఆకాశమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందని అన్నారు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద నౌకాశ్రయంగా జెబెల్ అలీ పోర్టుకు పేరుంది. భారత ఉపఖండంతో పాటు, ఆఫ్రికా, ఆసియాకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున సరుకుల రవాణా జరుగుతుంది.