Dubai: దుబాయ్‌ లోని జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు

Blast in Dubai Jebel Ali port
  • ప్రపంచంలోనే అతి పెద్ద నౌకాశ్రయం జెబెల్ అలీ పోర్టు
  • కంటెయినర్ షిప్ కు మంటలు అంటుకుని పేలుడు
  • ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాని వైనం
దుబాయ్ లోని ప్రఖ్యాత జెబెల్ అలీ పోర్టులో సంభవించిన భారీ పేలుడుతో ఆ నగరం ఉలిక్కి పడింది. పోర్టులోని ఓ కంటెయినర్ షిప్ కు మంటలు అంటుకుని, ఈ భారీ పేలుడు సంభవించింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విస్ఫోటనం జరిగింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంత వరకు తెలియరాలేదు. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

పేలుడు శబ్దంతో తాము భయకంపితులమయ్యామని పోర్టుకు సమీపంలో నివసిస్తున్నవారు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టామని, బయటకు వచ్చి చూస్తే ఆకాశమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందని అన్నారు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద నౌకాశ్రయంగా జెబెల్ అలీ పోర్టుకు పేరుంది. భారత ఉపఖండంతో పాటు, ఆఫ్రికా, ఆసియాకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున సరుకుల రవాణా జరుగుతుంది.
Dubai
Jebel Ali Port
Blast

More Telugu News