Nithin: వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ .. హీరోయిన్ గా పూజ హెగ్డే!

Nithin is pairing up with Pooja Hegde
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పూజ హెగ్డే చక్రం తిప్పేస్తోంది. థియేటర్లు తెరచుకోవాలేగాని ఆమె సినిమాలు వరుసగా రానున్నాయి. అవన్నీ కూడా భారీ సినిమాలు .. పాన్ ఇండియా మూవీలు కావడం విశేషం. తాజాగా ఆమె మరో సినిమాకి సైన్ చేసినట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ సినిమాకి హీరో నితిన్ అయితే .. దర్శకుడు వక్కంతం వంశీ. ప్రస్తుతం 'మాస్ట్రో' సినిమా చేస్తున్న నితిన్, ఆ తరువాత సినిమాను వక్కంతం వంశీతో చేయనున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు చెప్పుకున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అగ్రిమెంట్ కూడా అయిపోయిందని అంటున్నారు. పూజ తాజా చిత్రంగా అఖిల్ తో చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 'రాధేశ్యామ్' .. 'ఆచార్య' సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమాలో కథానాయికగా కూడా పూజ పేరునే వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా నితిన్ ప్రాజెక్టు కూడా ఆమె ఖాతాలో చేరిపోయింది. 'నా పేరు సూర్య'ను హిట్ దిశగా పరిగెత్తించలేకపోయిన వక్కంతం వంశీ, ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.  
Go Back to Shorts
Nithin
Pooja Hegde
Vakkantham Vamsi

More Telugu News