కేంద్ర కేబినెట్ లో మరో వికెట్ డౌన్.. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ రాజీనామా
- సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ
- ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్న పలువురు మంత్రులు
- ఏడుగురు సహాయ మంత్రులకు ప్రమోషన్
మరోవైపు అన్నివర్గాలకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త మంత్రి వర్గంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు ఇంజినీర్లు, 13 మంది న్యాయవాదులు ఉండబోతున్నట్టు సమాచారం. వీరితో పాటు పీహెచ్డీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు మోదీ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. సహాయమంత్రులుగా ఉన్న ఏడుగురికి ప్రమోషన్ దక్కనున్నట్టు సమాచారం.