Note for Vote: ఓటుకు నోటు కేసు.. స్టీఫెన్‌సన్ గన్‌మెన్‌ల వాంగ్మూలం నమోదు

Revanth Reddy and Sandra Skip trail in ACB Court
  • నిన్న ఉదయం ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ
  • విచారణకు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య గైర్హాజరు
  • నేడు రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్‌ల విచారణ

ఓటుకు నోటు కేసులో నిన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్టీఫెన్‌సన్ గన్‌మెన్‌లు నీరజ్‌రావు, రఘునందన్ సాక్షి వాంగ్మూలాలను  కోర్టు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ నిన్న జరిగింది. ఉదయ్ సిన్హా, సెబాస్టియన్ విచారణకు హాజరు కాగా, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య గైర్హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్‌లను నేడు విచారించనుంది. కాగా, ఈ నెల 13  వరకు 18 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం నమోదు చేసేందుకు న్యాయస్థానం ఇప్పటికే షెడ్యూలు ఖరారు చేసింది.

  • Loading...

More Telugu News