Trivikram Srinivas: నేను చూస్తున్నది ఇతడ్నేనా?: కల్యాణ్ రామ్ 'డెవిల్' గెటప్ పై త్రివిక్రమ్ ఆశ్చర్యం

Trivikram comments on Kalyan Ram Devil movie getup
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం వరుస చిత్రాలతో స్పీడు పెంచిన నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా 'డెవిల్' చిత్రాన్ని ప్రకటించాడు. కొత్త దర్శకుడు నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఇది నిర్మాణం జరుపుకోనుంది. ఇవాళ కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ బ్రిటీష్ కాలం నాటి సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు.

కాగా, డెవిల్ లో కల్యాణ్ రామ్ గెటప్ పట్ల ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను చూస్తున్నది ఇతడ్నేనా? అంటూ ట్విట్టర్ లో స్పందించారు. "నమ్మలేకపోతున్నాను... పీరియాడిక్ స్క్రిప్టులతో సినిమాలంటే ఎంతో ధైర్యంతో కూడిన వ్యవహారం. చిత్రబృందానికి శుభాకాంక్షలు" అంటూ పేర్కొన్నారు.
Go Back to Shorts
Trivikram Srinivas
Devil
Kalyan Ram
New Movie
Tollywood

More Telugu News